మేడ్చల్ CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే...

మేడ్చల్ CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే...

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్‌లోని CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల విశ్వాసం, ధైర్యం, సమాజం మరియు చర్చిలో వారి ప్రాధాన్యతపై ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించారు.శ్రీమతి ఎం. శ్రీలత అమ్మగారు దేవుని వాక్యాన్ని నడిపిస్తూ, కుటుంబం, చర్చి, సమాజంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు. CSI ఫార్మేషన్ డేను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు. 1947 సెప్టెంబర్ 27న దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రొటెస్టెంట్ సంప్రదాయాల ఐక్యతతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏర్పడిన సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. ఐక్యత, సేవ, విశ్వాసం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎం. జోసెఫ్ కిషోర్ అయ్యగారు, ప్రెస్‌బైటర్ ఇన్‌ఛార్జ్, ఆఫీస్ బేరర్లు, పాస్టోరేట్ కమిటీ సభ్యులు, మనోహరాబాద్ CSI చర్చి, మేడ్చల్ చర్చి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్ CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే... మేడ్చల్ CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్‌లోని CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల విశ్వాసం, ధైర్యం,...
మేడ్చల్‌లో వ్యక్తి మృతదేహం కల కలం ....
తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ ..
గ్రామ సర్పంచులు, అధికారుల సమన్వయం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..
ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే....
కాళ్లకల్ గ్రామ శివారులో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా రట్టు...
కోట మరమ్మతు పనులను పరిశీలించిన తహసీల్దార్ మాలతి....