మేడ్చల్‌లో వ్యక్తి మృతదేహం కల కలం ....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్ కళాశాల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అర్ధరాత్రి సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయినట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కృష్ణ చంద్ర (37)గా గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
27 Sep 2026 12:45:52
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్‌లోని CSI వెస్లీ చర్చిలో 80వ CSI ఫార్మేషన్ డే, ఉమెన్స్ సండే సర్వీస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల విశ్వాసం, ధైర్యం,...


