ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే....

మాజీ మంత్రి హరీష్ రావు....

ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే....

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రo

గజ్వెల్ ,సెప్టెంబర్ 26 (ప్రజాస్వరం):

భూమి కోసం , భుక్తి కోసం ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.ఈరోజు గజ్వేల్ పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలమ్మ పోరాట చరిత్రను గుర్తు చేసుకున్నారు.నిజాం కాలంలో భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీ వంటి అణచివేతలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తన భూమి, పంటను కాపాడుకోవడంతో పాటు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా నిలబడి పోరాడిన ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.చాకలి ఐలమ్మ అంటే ఒక పేరు కాదు.. ఒక పోరాట స్ఫూర్తి. ఆమె ధైర్యం తెలంగాణ మహిళలకు, అణగారిన వర్గాలకు ఎప్పటికీ ఆదర్శం అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయo అని తెలిపారు. ఐలమ్మ వంటి తెలంగాణ వీరుల చరిత్రను గుర్తించి, వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు.ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ ఆమె పేరును చిరస్థాయిగా నిలిపే కార్యక్రమాలకు కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేశారని పేర్కొన్నారు.కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాకలి ఐలమ్మ భవన్ నిర్మాణానికి రూ.కోటి నిధులు కేటాయించి, రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలిచేలా భవనాన్ని నిర్మించి ఇచ్చారని తెలిపారు. ఐలమ్మ పేరుతో నిర్మించిన ఈ భవనం ఆమె పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు.అదేవిధంగా పక్కనే ఉన్నా పాండవుల చెరువు ఇడుపు కాయితాలకే పరిమితమైన పాండవుల చెరువును కేసీఆర్ ఆధ్వర్యంలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. కొండపోచమ్మ మల్లన్నసాగర్ ప్రాజెక్టులతో గజ్వెల్ నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బంది లేకుండా కేసీఆర్ ఎనలేని కృషి చేశారని,గోదావరి నదిలో నీళ్లు వృథాగా వెళ్తున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని అన్నారు.గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.కేసీఆర్ హయాంలో వేసిన రోడ్లకు గుంతలు పడితే కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితి లేదని,కేసీఆర్ జిల్లా ఆసుపత్రిని,మెటర్నిటీ ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజల వైద్యం కోసం కృషి చేయగా కనీసం డాక్టర్లను నియమించే పరిస్థితి లేదని,సూది మందులు కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వ ఆసుపత్రులను దిగజార్చడంతో పేదలకు వైద్యం కరువయ్యే పరిస్థితి నెలకొందన్నారు.అయితే ప్రస్తుతం కేసీఆర్ హయాంలో నిర్మించిన భవనాలు, అభివృద్ధి పనుల నిర్వహణపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని కనీసం వాటికి సున్నాలు కూడా వేసే పరిస్థితి లేదని విమర్శించారు.చాకలి ఐలమ్మలాంటి ధైర్యశాలి మహిళల పోరాట చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారి స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు,రజక సంఘం ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Latest News

తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ .. తూప్రాన్ కోర్టు భవనాన్ని పరిశీలించిన..జిల్లా జడ్జి నీలిమ ..
తూప్రాన్, సెప్టెంబర్ 26 (ప్రజాస్వరం ) : ప్రతినిధి  మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో నూతనంగా మంజూరైనా జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం జిల్లా...
గ్రామ సర్పంచులు, అధికారుల సమన్వయం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..
ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే....
కాళ్లకల్ గ్రామ శివారులో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా రట్టు...
కోట మరమ్మతు పనులను పరిశీలించిన తహసీల్దార్ మాలతి....
నిరుపేదల కన్నీటికి అండగా లీల ...
మావోయిస్టుల పేరుతో లేఖలు.. సోషల్ మీడియా వ్యూస్ కోసం!..