నిరుపేదల కన్నీటికి అండగా లీల ...

నిరుపేదల కన్నీటికి అండగా లీల ...

గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్....

బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం....

చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 25 ( ప్రజాస్వరం ) :

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ లీల గ్రూప్ చైర్మన్, డాక్టర్ మోహన్ నాయక్ అండగా నిలిచారు. చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల ప్రమాదాలు, అనారోగ్యంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఓ దీనపత్రిక విలేకరి కమ్మరి దేవరాజు సుమారు మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. దేవరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం తన వంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దూదేకుల షబ్బీర్ కుటుంబాన్ని కూడా పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కామారం తండాలో పర్యటించిన డాక్టర్ మోహన్ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మూడవత్ కుమార్, గుండెపోటుతో మృతి చెందిన హలావత్ యాదగిరి, హలావత్ మహేందర్ కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. చిన్నారులను, కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. బాధిత కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. మొత్తం ఐదు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, కష్టకాలంలో వారికి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడమే కాకుండా, వారి వెంట తాము ఉన్నామనే భరోసాను కల్పించారు.

ప్రత్యేక అభినందనలు…..

కామారం తండా సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ హలావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలను పరామర్శించి, వారికి తన వంతు ఆర్థిక సహాయం అందించిన లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబాల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. బాధిత కుటుంబాలకు ఇలాంటి సహకారం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విలేకరులు నవీన్ కుమార్, ప్రభాకర్, అరుణ్ యాదవ్, సందీప్, లక్ష్మణ్, నరేష్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Latest News

కోట మరమ్మతు పనులను పరిశీలించిన తహసీల్దార్ మాలతి.... కోట మరమ్మతు పనులను పరిశీలించిన తహసీల్దార్ మాలతి....
చారిత్రక వైభవం చందంపేట గడికోట: పర్యాటక ఉత్సవాలకు ముస్తాబు.. పురాతన కట్టడాలను కాపాడుకుందాం: సర్పంచ్ ప్రవీణ్ కుమార్.. చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 25 ( ప్రజాస్వరం) :    తెలంగాణ...
నిరుపేదల కన్నీటికి అండగా లీల ...
మావోయిస్టుల పేరుతో లేఖలు.. సోషల్ మీడియా వ్యూస్ కోసం!..
మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం ....
ఘనంగా భద్రా రెడ్డి జన్మదిన వేడుకలు...
తెలంగాణ తొలి క్యూబ్ శాటిలైట్ రూపొందించిన విద్యార్థులు...
చెరువు కట్టను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్...