తెలంగాణ తొలి క్యూబ్ శాటిలైట్ రూపొందించిన విద్యార్థులు...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా క్యూబ్ శాటిలైట్‌ను కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు రూపొందించారు. శాన్సి ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ సహకారంతో ఈ నెల 21 నుంచి 23 వరకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో 134 మంది విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులను 10 బృందాలుగా విభజించి శాటిలైట్‌లోని వివిధ భాగాలను రూపొందించి, వాటిని అనుసంధానించి పూర్తి స్థాయి క్యూబ్ శాటిలైట్‌ను సిద్ధం చేశారు. చివరి రోజు నిర్వహించిన పరీక్షల్లో శాటిలైట్ ద్వారా సమాచారాన్ని విజయవంతంగా ప్రసారం చేయడంతో పాటు స్వీకరించారు.అనంతరం విద్యార్థులు, శాన్సి ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ ప్రతినిధులు సంయుక్తంగా రూపొందించిన తెలంగాణ తొలి క్యూబ్ శాటిలైట్‌ను సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ సీహెచ్. గోపాల్ రెడ్డి, డైరెక్టర్ రాజి రెడ్డిలకు అందజేశారు. విద్యార్థులు, అధ్యాపకులు, శాన్సి ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ బృందాన్ని చైర్మన్ అభినందించారు. నూతన ఆవిష్కరణలకు సీఎంఆర్ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Latest News
24 Sep 2026 18:00:38
ప్రజాస్వరం,మేడ్చల్ : వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో మేడ్చల్‌కు చెందిన...


