గణేష్ నిమజ్జనంలో అపశృతి…..
By Prajaswaram
On
కాలువలో పడిపోయిన కమిండ్ల గణేష్..
పోలీసులు, ఫైర్ సిబ్బందితో గాలింపు...
మాసాయిపేట , సెప్టెంబర్ 24 (ప్రజాస్వరం) :
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా కమిండ్ల గణేష్ ప్రమాదవశాత్తు హల్డీ ప్రాజెక్టు కాలువలో పడిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో గణేష్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.కాగా, గణేష్ ఇటీవలే తన చెల్లెలి వివాహాన్ని జరిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిమజ్జన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Latest News
24 Sep 2026 18:00:38
ప్రజాస్వరం,మేడ్చల్ : వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో మేడ్చల్‌కు చెందిన...


