చెరువు కట్టను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్...

చెరువు కట్టను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్...

మసాయిపేట / తూప్రాన్ ,సెప్టెంబర్ 25 (ప్రజాస్వరం) :

మెదక్ జిల్లా వెంకటాయపల్లి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ సర్పంచ్ బండకాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో చెరువు కట్టపై ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. చెరువు కట్టపై పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు, పొదలను ట్రాక్టర్ డోజర్ సహాయంతో తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.చెరువు కట్టపై గడ్డి, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. చెరువు కట్ట పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు శుభ్రత కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు, చెరువు పరిసరాలు, రహదారుల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీకి సహకరించాలని సర్పంచ్ హరీష్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం .... మేడ్చల్ లో రూ.53 వేలు పలికిన లడ్డు వేలం ....
ప్రజాస్వరం,మేడ్చల్ :   వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాత ఆలయంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో మేడ్చల్‌కు చెందిన...
ఘనంగా భద్రా రెడ్డి జన్మదిన వేడుకలు...
తెలంగాణ తొలి క్యూబ్ శాటిలైట్ రూపొందించిన విద్యార్థులు...
చెరువు కట్టను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్...
మేడ్చల్:గుర్తుతెలియని మృతదేహం.....
గణేష్ నిమజ్జనంలో అపశృతి…..
గుర్తు తెలియని మృతదేహం....