గ్రామ సర్పంచులు, అధికారుల సమన్వయం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..
మండల ప్రత్యేక అధికారి నీలిమ....
By Prajaswaram
On
నార్సింగి, సెప్టెంబర్ 26 ( ప్రజాస్వరం ) :
నార్సింగి మండల కేంద్రం లోని రైతు వేదిక లో ప్రత్యేక అధికారి నీలిమ ఆధ్వర్యంలో మండల పరిషత్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి నిర్వహించిన పనులు, భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని కులాల నిరుద్యోగ యువతకు దాదాపు 300 ఉపాధి కోర్సులలో అన్ని వసతులు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, గ్రామ సర్పంచులు దృష్టి సారించాలని అన్నారు. ఎంపీడీఓ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్లాస్టిక్ వాడకం పై దృష్టి సారించాలని, చేతి సంచులను వినియోగించేలా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలకు అవసరమైన భవనాలు ఇతర పనుల కు గ్రామ సభలలో తీర్మానాలు చేస్తే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మిషన్ భగీరథ శాఖ ఏఈ స్వప్న మాట్లాడుతూ మండలానికి నీరు ముఖ్యంగా గజ్వేల్, మెదక్ సెక్టార్ నుంచి సరఫరా జరుగుతాయని తెలిపారు. సింగూరు జలాశయం లో నీటి ఎద్దడి కారణంగా రెండు నెలల వరకు మెదక్ సెక్టార్ కు నీరు సరిపడతాయని, అటుపై నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నీటి ఎద్దడి నివారణ చర్యల పై దృష్టి పెట్టాలని, బోర్ మోటార్ల లో నీరు వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. విద్యుత్ శాఖ ఏఈ స్వామి మాట్లాడుతూ ఎలినినో ప్రభావం వల్ల హైడ్రల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం వల్ల వ్యవసాయానికి 12 గం విద్యుత్ అందిస్తున్నామని, భవిష్యత్ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఎలినినో ప్రభావం తో గోవులలో లంప్సి చర్మ వ్యాధి ప్రబలుతుందని, అన్ని గ్రామాలలో నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. మరోసారి కూడా టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల మలి విడత మంజూరు గురించి ప్రశ్నించగా, దసరా వరకు వెల్లడిస్తామని హౌసింగ్ ఏఈ తెలిపారు. పెద్ద తాండా సర్పంచ్ దుషాని ఛత్రియా నాయక్ తాండా లో నీటి కొరత ఉందని ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించాలని కోరగా పై అధికారులకు నివేదించి నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జప్తి శివునూరు, నర్సంపల్లి, శంఖాపూర్ తాండా సర్పంచులు గైర్హాజరు అవ్వగా మిగతా గ్రామాల సర్పంచులు, పలు శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Latest News
26 Sep 2026 19:58:49
తూప్రాన్, సెప్టెంబర్ 26 (ప్రజాస్వరం ) : ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లో నూతనంగా మంజూరైనా జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని శనివారం జిల్లా...


