పులి ఉంది అంటూ వాట్సప్ గ్రూపుల్లో వైరల్....

వాస్తవం కాదని చెప్పిన అటవీ శాఖ అధికారులు ..

పులి ఉంది అంటూ వాట్సప్ గ్రూపుల్లో వైరల్....

చిన్న శంకరంపేట, జనవరి 31 ( ప్రజాస్వరం) :                       

చిన్న శంకరంపేట మండలంలోని ఎస్ కొండాపూర్ అటవీ ప్రాంతంలో రోడ్డు నుంచి టీ మాందాపూర్ వైపు శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు పులి వెళ్లిందని, పులిని చూసామని వాయిస్ రికార్డ్ తో సమీప గ్రామాలలోని గ్రూపుల్లో వైరల్ అయింది, దీంతో అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ స్పందించి మన ప్రాంతంలో పులుల కదలికలు లేవని వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అవుతున్న ఫోటో నిర్మల్ జిల్లాలో గత నాలుగు నెలల క్రితం తీసిన ఫోటోగా గుర్తించినట్లుగా ఆయన చెప్పారు టీ మాందాపూర్ సమీపంలోని గజగట్లపల్లి గ్రామం అటవీ ప్రాంతంలో చిరుత అడుగులను సర్వేలో గుర్తించినట్లు పులులు సంచరిస్తున్నట్టు వస్తున్న వార్తలు నమ్మకూడదని ఆయన తెలిపారు.