సైబర్ నేరలపట్ల అప్రమత్తం గా ఉండాలి...
ఎస్ ఐ సంజయ్
పోలీసులు మీకోసం
ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం
ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం):
సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం బజార్ హతన్నూర్ మండలం పిప్రి గ్రామమలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా బోథ్ సర్సిల్ ఇన్స్పెక్టర్ గురుస్వామి, బజార్ హతన్నూర్ ఎస్ ఐ సంజయ్ అవగాహనా సదస్సు నిర్వహించారు వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈమధ్య నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో వచ్చే లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు డయల్ చేయాలని కూడా తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, వాటిని ఎప్పటికప్పుడు మార్చడం ముఖ్యం. అలాగే, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఈమెయిళ్ళు, సందేశాల్లోని లింక్‌లను నమ్మకండి. మీ వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. సైబర్ నేరాలకు గురైనట్లు తెలిస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వారు అన్నారు.. వారితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ కృష్ణకాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మురళి మోహన్, మాజీసర్పంచ్,కవిత రాఘన్ రెడ్డి,ఏనుగు లక్ష్మారెడ్డి, అడెల్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.


