కుంటను ఆక్రమిస్తే చర్యలు

ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

కుంటను ఆక్రమిస్తే చర్యలు

మనోహరాబాద్ (ప్రజాస్వరం) :

మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం గ్రామ శివారులో మాక్సోని కుంటాను కొంతమంది రియల్టర్లు ఆక్రమించారని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో మండల ఇరిగేషన్ అధికారి విజయ్, రెవెన్యూ ఆర్ఐ దీక్షిత్ కుంట స్థలంని పరిశీలించారు. అనంతరం కుంటను సర్వే చేసి, కుంటాను కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుంటలను కబ్జా చేస్తే చర్యలు తప్పమన్నారు.చెరువులని కుంటలని కాపాడాలని చెట్ల గౌరారం గ్రామస్తులు అధికారులను కోరారు.. ఇందులో చెట్ల గౌరారం సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు.