శేరిపల్లిలో పౌర హక్కుల దినోత్సవం..
నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ):
కుల వివక్ష అమానుషం, చట్ట రీత్యా నేరమని స్థానిక తహశీల్దార్
గ్రేస్ బాయి అన్నారు. శనివారం గ్రేస్ బాయి ఆధ్వర్యంలో మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ మాసం నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం జరుపుతామని, ఇందులో ప్రజలకు రాజ్యాంగంలో వారికి కల్పించిన హక్కులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్థానిక సర్పంచ్ సంతోష గొండస్వామి మాట్లాడుతూ కుల వివక్ష చట్ట రీత్యా నేరమని మనుష్యులందరూ సమానమని, కుల వివక్ష సరి కాదని, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కును కల్పించిందని అన్నారు. ఒకప్పుడు కుల వివక్ష విర్రవీగేదని, అంటరానితనం వల్ల బడుగు వర్గాల బ్రతుకులు దుర్భరమయ్యేవని, భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతటి వారికి కూడా వివక్ష తప్పలేదని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజలు చైతన్యవంతం అయ్యారని, ఇది శుభ పరిణామమని అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష గోండస్వామి యాదవ్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, మేఘన, ఎ ఎసై మిస్బావుద్దిన్, జిపిఓ అన్నపూర్ణ, గ్రామ పంచాయితీ కార్యదర్శి నాగరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


