దుబ్బాకలో  గులాబీ జెండా ఎగరేయాలి 

 దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

దుబ్బాకలో  గులాబీ జెండా ఎగరేయాలి 

దుబ్బాక / సిద్దిపేట (ప్రజాస్వరం) : 

 

దుబ్బాకలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి మనందరికి మంచి పేరు తేవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాకపై కేటీఆర్, హరీశ్ రావుల ప్రత్యేక దృష్టి ఉంటుందని ప్రతి ఒక్కరు గెలుపుకోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో 

 అన్ని సీట్లు గెలిచి మన సత్తా చాటాలన్నారు. కెసీఆర్ సొంత గడ్డైనా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గెలిచి మన సత్తా ఏమిటో మరోసారి చూపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేక చేసేదేం లేదని ఎద్దేవ చేశారు.మన ప్రభుత్వం చేసిన అభివృద్ధే తప్ప వారు చేసిందేమీ లేదన్నారు. మన ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులను రద్దు చేసి పేరు మార్చి అవే పనులను ఈ ప్రభుత్వం చేపడుతుందన్నారు. 

 దుబ్బాక చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ భాద్యత మన అందరి పై ఉందన్నారు . ఏ వార్డులో ఏ రిజర్వేషన్ వచ్చిన అందరం కలిసి పని చేయాలని ఎవరు నారాజ్ కావొద్దని కోరారు.. అన్ని ఎన్నికల కంటే ఈ ఎలక్షన్ చాలా కీలకమైనదన్నారు. 

 20 వార్డులను అన్నీ కూడా గెలిచి సత్తా చాటాలన్నారు.ఈ సమావేశం లో ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.