దేవాలయ వార్షికోత్సవ వేడుకలో....

ఈర్ల రాజు ముదిరాజ్..

దేవాలయ వార్షికోత్సవ వేడుకలో....

అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):

ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మండలం పటేల్ గూడా బిహెచ్ఇఎల్ మెట్రో కాలనీలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈర్ల రాజు మాట్లాడుతూ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ సొసైటీ నాయకులకు ఆలయ కమిటీ కార్యవర్గానికి ఈ ప్రాంత ప్రజలకు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుడిని కోరారు.ఈ కార్యక్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి.తలారి అశోక్ ముదిరాజ్.మల్లికార్జున్. బిజెపి నాయకులు తిరుపతి రెడ్డి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Latest News