మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం

బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు శలక రాజేశ్వర్ శర్మ

మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం

తూప్రాన్, జనవరి 19 (ప్రజాస్వరం ) :                                రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయమని బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు శలక రాజేశ్వర్ శర్మ అన్నారు. తూప్రాన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పదేళ్ల కేసీఆర్ పాలనలో తూప్రాన్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు. తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. ఇప్పుడు ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీ వాగులో నీళ్లు నింపి 24 గంటల సాగు నీరు కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అంతే కాకుండా తూప్రాన్ లో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ దవాఖాన, విద్యా వ్యవస్థ ను మెరుగు పరిచారన్నారని కొనియాడారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని మున్సిపాలిటీలో జెండా ఎగురవేయడం తధ్యమన్నారు.