మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..
By Prajaswaram
On
పితృవియోగంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంతాపం
అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):
అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ యూనుస్ తండ్రి ఇటీవల పరమపదించడంతో, శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి యూనుస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పితృవియోగంపై సంతాపం తెలుపుతూ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ కౌన్సిలర్ కృష్ణ తదితరులు యూనుస్ నివాసానికి చేరుకున్నారు.
పితృవియోగంతో బాధపడుతున్న యూనుస్ మరియు వారి కుటుంబ సభ్యులను నేతలు వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ యూనుస్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహా ఇతర నాయకులు భరోసా ఇచ్చారు.
Latest News
31 Jan 2026 20:02:16
పోలీసులు మీకోసం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం): సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం బజార్ హతన్నూర్ మండలం...


