రూ.1లక్ష 90వేలు పలికిన క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు

రూ.1లక్ష 90వేలు పలికిన క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు

మేడ్చల్,(ప్రజాస్వరం):                                                        మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి ఘనపూర్ గ్రామంలోని క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక మహోత్సవాల సందర్భంగా పూజలందుకున్న లడ్డును శుక్రవారం కనుమ పండుగ జాతర ముగింపు సందర్భంగా వేలంపాట నిర్వహించారు.ఈ వేలంపాటలో రాజబొల్లారం తాండకు చెందిన మిత్రులు మాలోత్ పాండ్యరాజు, గోగులోత్

చందర్ లు కలసి రూ.1లక్ష 90 వేలకు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న

లడ్డును దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు.రాజబొల్లారం తాండతో పాటు ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.