హర్షం వ్యక్తం చేస్తున్న సీతారాంపల్లి ఉపాధి హామీ ప్రజలు ..

హర్షం వ్యక్తం చేస్తున్న సీతారాంపల్లి ఉపాధి హామీ ప్రజలు ..

సంక్షేమం నుంచి సంపద సృష్టికి 'విబి గ్రామ్ జి‘ తోని గ్రామ స్వరాజ్యం !

గజ్వేల్, జనవరి 31 (ప్రజాస్వరం):

మెదక్ పార్లమెంట్ వర్యులు మాధవనేని రఘునందన్ రావు పిలుపు మేరకు వర్గల్ మండలం సీతారాంపల్లిలో వర్గల్ మండల బిజెపి అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి,సీతారాంపల్లి సర్పంచ్ కుక్కల ఆండాలు రామఆంజనేయులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB -GRAM-G చట్టం గురించి తెలియజేశారు. 100 రోజుల నుంచి 120 రోజులకు పొడగించినందుకు సీతారాంపల్లి ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ఇది పారదర్శకకు పెద్దపీట సమాజంలో మార్పు తీసుకురావాలని ఉద్దేశంతోనే VB -GRAM-G చట్టం తీసుకొచ్చారని తెలియజేస్తూ,దేశంలో చిట్టచివరి స్థాయి వ్యక్తి కూడా కేంద్ర పథకాలు అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చారు అని ఉపాధి హామీ ప్రజలకు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు రేణు దాసు, శ్రీకాంత్ , భాను కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.