ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని కలిసిన పురం మహేష్ 

ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని కలిసిన పురం మహేష్ 

మనోహరాబాద్ ( ప్రజాస్వరం ) :

 

 దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని మనోహరాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహేష్ ముదిరాజ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముప్పిరెడ్డిపల్లి వార్డు సభ్యులు సాధు సత్యనారాయణ ముదిరాజ్, ముప్పిరెడ్డిపల్లి గ్రామ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, ఉద్యమకారుడు శివ, నాయకులు నరేష్ ముదిరాజులు కలిసి శాలువాతో సత్కరించి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.