తూప్రాన్ గ్రామం పేరు వెనుక చరిత్ర తూపు రాణి....కాబోయే చైర్మన్ మహిళ !?

తూప్రాన్ గ్రామం పేరు వెనుక చరిత్ర తూపు రాణి....కాబోయే చైర్మన్ మహిళ !?

తూప్రాన్ జనవరి 6 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ గ్రామం పేరు వెనుక చరిత్ర *తూపురాణి* అనే పేరు నుండి వచ్చింది. తూపురాణి అనగా కొండవాగు లేదా హళ్దీవాగు. ఈ వాగు తూప్రాన్ గ్రామం తూర్పు వైపు నుండి ప్రవహిస్తూ కొంత దూరం తర్వాత పడమర వైపుకు తన ప్రవాహ గమనాన్ని మార్చి చివరకు మెదక్ దగ్గర మంజీర నదిలో కలుస్తుంది.


పూర్వం తూప్రాన్ గ్రామం హళ్దీనది/ తూపురాణి ప్రక్కన వెలసిల్లేది. గ్రామం మధ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయం కిష్టపూర్ దారిలో ప్రసిద్ధ రామాలయం, ఒక రాతి గుహలో శ్రీశ్రీ నరసింహస్వామివారి గుడి ఉన్నది

తూప్రాన్ గ్రామం వాణిజ్య వ్యాపార అభివృద్ధి పరంగా జాతీయ రహదారి-44 వైపు పడమర దిశకు క్రమేణా విస్తరించి ప్రముఖ పట్టణంగా, మేజర్ గ్రామ పంచాయతీ నుండి ప్రస్తుతం పురపాలక సంఘంగా అభివృద్ధి చెందింది. "తూపురాణి" ఊరి పేరు కాస్తా కాలక్రమేణా తూప్రాన్ గా రూపాంతరం పొందింది. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత

తూప్రాన్ మేజర్ గ్రామపంచాయతీ గా SC జనరల్ రిజర్వేషన్ రావడంతో ఎన్నికల లో పోటీ చేసి చిట్టిమిల్ల శివమ్మా సర్పంచ్ గా గెలిచి 5 సంవత్సరాల కాలం పరిపాలనా చేశారు నూతన మున్సిపాలిటీ ఏరు పడ్డాక BC జనరల్ రిజర్వేషన్ లో బొంది రవీందర్ గౌడ్ చైర్మన్ గా ఎన్నుకున్నారు బి ఆర్ ఎస్ అధికారం కొలిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ నుండి మామిడ్ల జ్యోతి కిష్ణ ఎన్నుకున్నారు తూప్రాన్ మున్సిపాలిటీ మహిళ రిజర్వేషన్ రానుంది తూప్రాన్ కు రాణి పరిపాలించే అవకాశం ఉంటుంది ఏ పార్టీ మహిళ రాణి చైర్మన్ పీఠాన్ని అలంకరించనున్నదో వేచిచూడాలి...తూప్రాన్ పట్టణ లో యుద్ధనౌక గద్దర్ జన్మస్థలం జానాట్య మండలి సభ్యులు పట్టణానికి మొదటి సర్పంచ్ గా గోపాల్ రెడ్డి తర్వాత రామన్న గారి సత్యనారాయణ గౌడ్ చనిపోయేవరకు సర్పంచ్ పదవిలో కనసాగారు విరకుమార్ గౌడ్ మూడు పర్యాయాలు సర్పంచ్ ఉన్నారు కమ్మరి సత్యనారాయణ వెంకట్ రెడ్డి చిట్టిమిల్ల శివమ్మా చివరి సర్పంచ్ గా ఉన్నారు