ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి..

ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి..

నార్సింగి, జనవరి 19 ( ప్రజాస్వరం ):

 

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా నిర్వహించే ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలకు విద్యార్దులు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని నార్సింగి లోని ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 21 న మొదటి సంవత్సర ఇంటర్ విద్యార్థులకు, 22 న ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, 24 న మొదటి సంవత్సర ఇంటర్ విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని, ఈ పరీక్షలకు విద్యార్దులు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కాకుండా వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినా "మార్క్స్ మెమో" లో "ఫెయిల్" అని వస్తుందన్న విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గమనించాలని, పరీక్షలకు తప్పకుండా హాజరు అయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయి, మంచి మార్కులు సాధించాలని కలశాల ప్రధాన ఉపాధ్యాయుడు అన్నారు.