ఘనంగా రోడ్డు భద్రతా 2K రన్....

ఘనంగా రోడ్డు భద్రతా 2K రన్....

ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం):

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ,నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో '2K రన్' నిర్వహించారు. ఈ పరుగు స్థానిక ఆర్.టి.ఓ. కార్యాలయం నుండి ప్రారంభమై ప్రియదర్శిని స్టేడియం వరకు రోడ్డు భద్రతా నినాదాలతో చేపట్టిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్బంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ... రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, విద్యార్థులు, యువత, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, విద్యార్థులు తమ తల్లితండ్రులకు, బంధుమిత్రులకు రహదారి భద్రత అవగాహన కల్పించాలని సూచించారు. నెల రోజుల పాటు రవాణా శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాలు ప్రశంసనీయమని కలెక్టర్ అధికారులను అభినందించారు.తదుపరి 2కే రన్‌లో విజేతలకు, అతిథులకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్, డివైఎస్ఓ శ్రీనివాస్ గారు, జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి ఎస్.శ్రీనివాస్, విద్యార్థులు, యువత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Latest News