జన్ సేవ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ పంపిణీ..
మేడ్చల్, జనవరి 31 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా మేడ్చల్ చెక్ పోస్ట్ లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం లో భాగంగా సడక్ సురక్ష అభియాన్-జాగ్రత్త కార్యక్రమాన్ని జన్ సేవ సంఘ్ హైద్రబాద్ మేడ్చల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓ ఆర్ ఆర్ ఐ ఆర్ బి ప్రాజెక్ట్ హెడ్ కోలోనెల్ గిరీశ్వర్,టోల్స్ చీఫ్ ఎం. ఎన్. మూర్తి,మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి,ట్రాఫిక్ సిఐ మధు సుధన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు డ్రైవర్లకు మరియు వాహన దారులకు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టలన్నారు.భారత దేశంలో 80 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు దానిని గ్రహించి డ్రైవర్లకు అవగాహన కల్పించమన్నారు.అనంతరం జన్ సేవ సంఘ్ హైద్రాబాద్ బాడ్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జన్ సేవ సంఘ్ అధ్యక్షుడు విశ్వజీత్,జనరల్ సెక్రటరీ ప్రకాష్ చౌదరి,కోశాధికారి సుశీల్ శ్రీ వత్సవ్,ప్రోటోకాల్ కన్వీనర్ శ్రీకాంత్ పాండే,డిస్ ప్లేన్ కమిటీ ప్రెసిడెంట్ పి. పి.పాండే,రాజు చౌబే, అరుణ్ రాజ్ పురోహిత్,కబిరాజ్ సింగ్,రాజేష్ చౌబె,దినేష్, బోలా సింగ్ లతో పాటు ట్రాఫిక్ సిబ్బంది, ఐ ఆర్ బి సిబ్బంది పాల్గొన్నారు.


