సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభించిన ఎంపీడీఓ ప్రీతి రెడ్డి..
ఈనెల 17 నుండి ప్రారంభం..
నార్సింగి, జనవరి 17 ( ప్రజాస్వరం ):
ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని నార్సింగి ఎంపీడీవో ప్రీతి రెడ్డి అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసానికి కీలకంగా దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి పేరిట సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నార్సింగి పట్టణంలో సీఎం కప్ జ్యోతి ర్యాలీని నిర్వహించారు. సీఎం కప్ మండల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంపీడీవో ప్రీతి రెడ్డి జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ నార్సింగి పురవీధుల గుండా సాగింది.సీఎం కప్ క్రీడా పోటీలు ఈ నెల 17 నుండి 22 వరకు గ్రామపంచాయతీ స్థాయిలో, ఈ నెల 28 నుండి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుండి 5 వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 9 నుండి 12 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తహసీల్దార్ గ్రేసీ బాయి, గ్రామ సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్, నార్సింగి ఎంఈఓ గంగాబాయ్, ఎస్సై సృజన, జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు రవిచందర్, నార్సింగి మండల సీఎం కప్ క్లస్టర్ ఇంచార్జ్ పి.డి.అశోక్, ఉపాధ్యాయులు పూర్ణచందర్రావు ,రామకృష్ణ, దీప, పల్లవి, స్వప్న, పుష్పలత, వెంకటేశం, శివ రాములు తదితరులు పాల్గొన్నారు.


