అమ్మవారి దీవెనలు రాష్ట్ర ప్రజల మీద ఉండాలి

సాయి యాదవ్

అమ్మవారి దీవెనలు రాష్ట్ర ప్రజల మీద ఉండాలి

జగదేవ్ పూర్:జనవరి19,(ప్రజాస్వరం):

 

జగదేవ్ పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండ పోచమ్మ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలలో భాగంగా అంబర్పేట్ చెందిన సాయి యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఆలయంలో మహా చండీయాగం ,సంప్రదాయమైన నృత్యాలతో చూపర్లను ఆకట్టుకునే విధంగా వేషాధారణతో ఆకట్టుకున్నాయి. అనంతరం అమ్మవారికి బోనము సమర్పించి ఘటం కుండా, పట్నం వేసి మొక్కులు చెల్లించారు .అమ్మవారి ఆలయం వద్ద వచ్చే భక్తులకు అన్నవితరణ కార్యక్రమం చేపట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ స్వామి,మాజీ సర్పంచ్ రజిత రమేష్, తదితరులు పాల్గొన్నారు.