ఇందిరమ్మ మహిళా శక్తి రుణాల పంపిణీ
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
రామాయంపేట. జనవరి. 19.( ప్రజాస్వరం ):
మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన ఇందిర మహిళ శక్తి రుణాల పంపిణీ కార్యక్రమలో మెదక్ డాక్టర్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని 396 మంది మహిళలకు రూ. 1.09కోట్ల రుణాలు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేద మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తూ వారికి అండగా నిలుస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు అన్ని రంగాల్లో రానించే విధంగా కృషి చేస్తుందన్నారు. వడ్డీ లేని రుణాలు ద్వారా మహిళలు తమకు తాము ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు అవకాశం కలిపిస్తుందన్నారు. అనంతరం సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో డ్వాక్రా గ్రూపు మహిళలు, రామాయంపేట కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, దేమే యాదగిరి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, చింతల స్వామి, బండారి మహేందర్ రెడ్డి, సర్పంచ్ రామకృష్ణయ్య,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


