మద్యం మత్తు లో 22 రూపాయల కోసం....
తూప్రాన్ జనవరి 18 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ పరిధిలో జరిగిన యువకుడి పై హత్య కేసును చేగుంట పోలీసులు వేగంగా, సమర్థవంతంగా చేదించి మహేష్ కుమార్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించిన్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు
తేదీ 15.01.2026 నాడు మధ్యాహ్నం సుమారు 03:00 గంటల సమయంలో, చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులోని సర్వే నం. 33 లో ఉన్న ఒక చింతచెట్టు కింద, మొహమ్మద్ సిరాజ్ (30 ), కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు , ఘటీపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి తలపై రాయితో పలుసార్ల దాడి చేయడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి సహోద్యోగి మరియు ఒకే ఇంట్లో ఉంటున్న అయిన రవి కుమర్ ఫిర్యాదు మేరకు, చేగుంట పోలీస్ స్టేషన్లో Cr. No. 22/2026 U/s 103(1) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో, మృతుడు మరియు నిందితుడు మహేష్ కుమార్ బర్మా (23 ) ఇద్దరూ ఒకే సంస్థలో కూలీలుగా పనిచేస్తూ, గత కొన్ని కాలంగా ఒక గదిలో నివసిస్తున్నారు, సంఘటన రోజు ఇద్దరూ కలిసి మధ్యం సేవించారు. ఆ సమయంలో నిందితుడు మహేష్ తనకు బాకీ ఉన్న కేవలం 22 రూపాయల కోసం మృతుడు సిరాజ్ ను పట్టు పట్టడంతో వివాదం తలెత్తి , మాటా మాటా పెరిగి గొడవకు దారితీయడంతో , కోపోద్రిక్తుడైన నిందితుడు మృతుడని అక్కడ ఉన్న చింతచెట్టుకు తలను కొట్టి , సమీపంలో ఉన్న రాయిని తీసుకొని సిరాజ్ తలపై 4-5 సార్లు బలంగా కొట్టి అక్కడి నుండి పారిపోయాడు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంభటనా స్థలాన్ని క్రైమ్ టీమ్ సహకారంతో పరిశీలించి, రక్తం మరకలున్న రాయి, మధ్యం సీసాలు, చెప్పులు తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ సిఐ రంగా కృష్ణ, చేగుంట ఎసై చైతన్య రెడ్డి ఆద్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుడు గురించి విస్తృ
నిందితుడు అరెస్టు:
నీరం చేసిన అనంతరం నిందితుడు మృతుడి మొబైల్ ఫోన్సు ధ్వంసం చేసి, అక్కడి నుండి పారిపోయాడు. ఊరోజ్ నమ్మదిగిన సమాచారంంతో, తేదీ 17.01.2026 నాడు మసాయిపేట శివార్లో ఒక దాబా వద్ద లారీ లో ఉత్తరప్రదేశ్ పారిపోవడానికి చూస్తుండగా పోలీసులకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు అంగీకరించడంతో, అతని వద్ద ఉన్న రక్తపు మరకలతో కూడిన దుస్తులను స్వాధీనం చేసుకొని, నిబంధనల ప్రకారం అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
నిందితుడు 2024 సంవత్సరంలో ఉపాది నివృత్తి హైదరాబాద్కు వచ్చి పయింటింగ్ పనులు చేశాడు. అనంతరం బీహార్ రాష్ట్రానికి చెందిన చందన్ అనే వ్యక్తి ద్వారా అనంతసాగర్ గ్రామంలో ఉన్న సప్తగిరి పార్కు కాంప్లెక్స్లో తాళ్కాలిక పనికి వెళుతున్నాను అక్కడి లేబర్ సూపర్వైజర్ ఆదీనంలో మృతుడు మరియు ఇతర కార్మికులతో కలిసి నివాసం ఉంటున్నాడు.


