బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం...
చిన్న శంకరంపేట నవంబర్ 22
( ప్రజాస్వరం )
చిన్న శంకరంపేట మండలం మడూర్ సహకార సంఘం నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ జరుగుతుండడంతో పదవీకాలం పొడిగించకుండా అధికారులు పాలకవర్గాన్ని రద్దు చేశారు ఈ సందర్భంగా మడూర్ సహకార సంఘం బాధ్యతలను డిసిఓ కార్యాలయ అధికారికి పర్సన్ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు దీంతో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో పదకొండు మంది డైరెక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో మడూర్ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు పదవి బాధ్యతను స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని ప్రతి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు, రైతులు పాలకవర్గ సభ్యులు సొసైటీ అభివృద్ధి కోసం సహకరించాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, డైరెక్టర్లు సిద్ధ గౌడ్, సిద్ధిరాములు, విట్టల్ నాయక్, చంద్రం, శ్రీనివాస్, లక్ష్మి, బాలయ్య, తోపాటు సీఈఓ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు సిబ్బంది పాల్గొన్నారు.


