ఆయిల్ ఫామ్ తోటల సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చు
ఆయిల్ ఫామ్ తోటల సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చు
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్,
రామయంపేట. 20:( ప్రజాస్వరం)
ఆయిల్ ఫామ్ తోటల సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో సహకార సంఘం మహారోత్సవాల సందర్భంగా పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవ రసాక అధికారి ప్రతాప్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల జరిగే లాభాలను వివరించారు. రైతులకు మొక్కలు, డ్రిప్పు పరికరాలు సబ్సిడీపై అందిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. మూడు సంవత్సరాల పాటు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని నాలుగో సంవత్సరం నుండి పంట చేతికి వస్తుందని అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర్ పంటలు గా పలు పంటలను పండించుకోవచ్చని, వరి పొలాల్లో సైతం ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చని సూచించారు. రైతులు పండించిన ఆయిల్ ఫామ్ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సహకార బ్యాంక్ మేనేజర్ శ్వేత మాట్లాడుతూ సహకార వారోత్సవాలు పురస్కరించుకొని తమ బ్యాంకు ద్వారా స్వర్ణ నిధి డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఏ బ్యాంకులో లేని విధంగా అత్యధికంగా వడ్డీ రేట్లు చెల్లిస్తున్నందున ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ, పిఎసిఎస్ సీఈవో పుట్టి నర్సింలు తదితరులు పాల్గొన్నారు


