సిద్దిపేట డీసీసీ గా తుంకుంట ఆంక్షరెడ్డి నియామకం..

సిద్దిపేట డీసీసీ గా తుంకుంట ఆంక్షరెడ్డి నియామకం..

గజ్వెల్ నవంబర్ 23 ప్రజస్వరం

 

Read More లక్షలాది మందికి ఆశా కిరణాలుగా సత్య సాయి సేవలు.... 

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తూముకుంట ఆంక్షరెడ్డి నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కోటలో ఆమెకు ఈ పదవి దక్కినట్టు సమాచారం. కాగా మాజీ ఎమ్మెల్యే, ఇప్పటి వరకు సిద్దిపేట డీసీసీ అధ్యక్షులుగా ఉన్న నర్సారెడ్డి.. మరోమారు తన పట్టును నిలుపుకున్నారు..సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 120 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో రాష్ట్రం ఏర్పడి నుండి ఇప్పటివరకు డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపడుతూ ఉనికిని చాటుకున్నారు. కాగా ఇటీవల కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించడంతో.. కూతురు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నట నటరాజన్, పీసీసీ అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్, నియో జకవర్గ పరిశీలకు వినతిపత్రం అందించారు. దాంతో మహి ళా కోటాలో డీసీసీ అధ్యక్ష పదవి ఆంక్ష రెడ్డికి దక్కింది. కాగా ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నేతలతో అత్యంత రాజకీయ సంబంధాలు ఉన్నాయి. పీసీసీ పిలుపు కార్యక్ర మాలు విజయవంతం చేయడంతో పాటు ఇటీవల సిద్దిపేట నుంచి గాంధీభవన్ వరకు పాదయాత్రలో డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డితో పాటు పాల్గొన్నారు.గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, తల్లి మధు శ్రీ గృహిణి దంపతులు కూతురు ఆంక్ష రెడ్డి.. 1997 ఆగస్టు 12న హైదరాబాదులో జన్మించింది. విద్యా, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతల్లో చిన్ననాటి నుంచే తనదైన ముద్ర వేసుకున్నారు. డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఐబి వాలిడి స్కూల్ ఎస్ఎస్సి (2012), విల్లా మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్, (2014) బీబీఏ యూని వర్సిటీ ఆఫ్ బెడ్ ఫోర్ సైడ్ లండన్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనాలెక్ష్ నా ట్రోబీ యూనివర్సిటీ మెల్చర్లో చేసింది. కాగా ఆంక్ష రెడ్డి జీవిత భాగస్వామి కళాత్తూర్ నిరూపరెడ్డి తెలంగాణలో ప్రముఖ పారిశ్రామిక వేత్త. దంపలిద్దరూ కలిసి వ్యాపారం, సామాజిక సేవల్లో చురుగ్గా ఉంటున్నారు. కాగా ఆమె కరాటేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ పొందింది. జపాన్ కరాటే అసోసియేషన్ లైసెన్స్ సర్టిఫికెట్ కూడా అందుకున్నది. స్కెటింగ్ నేషనల్ స్టైల్ బ్రాంజమెడల్ సాధించింది.

Read More గుమ్మడిదల మున్సిపల్ ఎదుట ధర్నా