సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
హైదరాబాద్ (ప్రజాస్వరం) :
సౌదీ ఆరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మంత్రిశ్రీ మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, అందుకోసం బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలోనంబర్ లతో
+91 79979 59754, +91 99129 19545 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.


