డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
మేడ్చల్:(ప్రజా స్వరం) :
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ అన్నారు. కేంద్ర రాష్ట్రల ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించారు. కమిషనర్ వెంకట గోపాల్ పాల్గొని మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే హానిని వివరించారు. మాదకద్రవ్యాల ను సేవించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. మారకద్రవ్యాల వల్ల తమ కుటుంబ వాలే కాకుండా సమాజానికి సైతం నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.


