మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...

మెదక్ ,నవంబర్ 17 (ప్రజా స్వరం)

నిరుపేదలకు కనీస నివాస గృహం ఉండాలన్న సంకల్పం తో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లా లో వంద శాతం త్వరగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. టేక్మాల్ మండలంలో పర్యటించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు 55 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు పూర్తి అయిందన్నారు. 2,439  ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ పూర్తి చేశారని, 944 గోడలు పూర్తి చేశారని, 673 స్లాబుల స్థాయిలో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 24 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ఇప్పటికీ 15 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకు వచ్చిందని జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు పురోగతి వేగం పెంచాలన్నారు. మంజూరు అయిన ప్రతీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. అసలు ఇంకా ఎందుకు నిర్మాణం చేపట్టలేదో అధికారులు క్షేత్ర స్థాయి లోకి వెళ్లి లబ్ధిదారుల తో మాట్లాడి వారి సమస్య లు ఏమైన ఉంటే తెలుసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యి ఎవరైనా ఇంకా మొదలు పెట్టని వారి ఇండ్లు రద్దు చేసి, అవసరం ఉన్న లబ్ది దారులకు ఇవ్వాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. మార్కింగ్ చేసినప్పటికీ ఇంకనూ బెస్మెంట్ నిర్మాణం చేయని లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్య లను తెలుసుకొని ఆ నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read More పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి