కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి

జాతరపై మంత్రి కొండ సురేఖ సమీక్ష

కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి



సిద్దిపేట, (ప్రజాస్వరం) :
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని శ్రీ కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరలను   తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని  దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ  అధికారులను ఆదేశించారు.  వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
సోమవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి సురేఖ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం కంటే ముందు మల్లన్న జాతర, కళ్యాణం పోస్టరును మంత్రి సురేఖ రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ, ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెకట్రరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ  కమిషనర్ హరీష్, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆర్డివో, కొమురవెల్లి ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్,  ఆర్టిసి డిపో మేనేజర్, డిఎంహెచ్ఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది,గ్రామీణ నీటి సరఫరా, ఫైర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తదితర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రివ్యూ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మాట్లాడుతూ. గత సంవత్సరం కంటే మరింత వైభవోపేతంగా మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జాతర, కల్యాణం నిర్వహించిన సమయంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి అవి రాకుండా చూడాలని సూచించారు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని, జనవరి 18 నుండి 10 వారాలపాటు మార్చి 16 వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ఈ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని పోలీస్, విద్యుత్, వైద్యారోగ్యం, ఆర్టీసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా,  ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కల్యాణాన్ని వీక్షించి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యేందుకు వీలుగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ కలెక్టర్ ను నిర్దేశించారు.
స్వామివారి ప్రసాదం తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాతర జరుగుతున్నన్ని రోజులు సాయంత్రాల్లో కళాబృందాలచే ఒగ్గుకథ వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖకు ఆదేశాలివ్వాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. కల్యాణోత్సవానికి వారం రోజుల ముందే సర్వసన్నద్ధంగా వుండేలా కార్యాచరణను వెంటనే అమలుపరచాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
ఆలయంలో... ఆలయ ఆవరణలో పరిశుభ్రత తప్పనిసరి అని..అందుకోసం అవసరమైతే పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా అపాయింట్ చేసుకోవాలని కలెక్టర్ కు చెప్పారు.

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి