ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?

ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?


            
హైదరాబాద్‌ నవంబర్ 17  (ప్రజాస్వరం) :
: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌పై సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలని సీజేఐ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం, రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది.

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి