పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...

పంట పొలాల్లోకి  పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి  పట్టుకున్న ఏసీబీ అధికారులు...

పొలాల్లోకి పరుగులెత్తిన ఎస్ఐ......
  

మెదక్ నవంబర్ 18 (ప్రజా స్వరం)

Read More యువతరం ద్వారానే నవ సమాజ నిర్మాణం

ఏసీబీ ట్రాప్ ను గమనించిన ఎస్ఐ పోలీసు స్టేషన్ వెనుక వైపు గోడ దూకి, పొలాల మీదుగా పరుగులు తీశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్టేషన్ వద్ద జరిగింది. ఎస్ఐ ను పట్టుకునేందుకు అక్కడే మాటు వేసిన సుమారు 15 మంది ఏసీబీ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఏసీబీ కి ఎస్ఐ రాజేశ్ చిక్కినట్లు తెలియడంతో స్థానికులు టపాసులు పేల్చి కేరింతలు కొట్టారు. టెక్మాల్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు అద్దెకు తీసుకొచ్చిన హార్వెస్టర్ బ్యాటరీ చోరీ సంఘటన పై ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పరిష్కరించడానికి అసద్ మహమ్మద్ పల్లి కి చెందిన రైతు పాండును స్థానిక ఎస్ఐ రాజేష్ 50 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఒప్పందం ప్రకారం మొదటి దఫా గా 30వేలు బాధితుడు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు టెక్మాల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు 20 వేలు ఎస్ఐ కు ఇచ్చి వెళ్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ ట్రాప్ పై అనుమానం వచ్చిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాదాపు 15 మందితో కూడిన అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం పొలాల్లో పరిగెత్తుతున్న ఎస్ఐ ను వెంబడించి పట్టుకున్నారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో అధికారుల కొనసాగుతున్నాయి. కాగా ఓ వైపు ఏసీబీ అధికారులు ఎస్ఐ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారిస్తుండగా మరోవైపు స్థానికులు టపాసులు పేల్చడం గమనార్హం....

Read More స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి