సీఎం జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన
ఉచితవైద్య శిబిరం ప్రారంభించిన
టిపిసిసి చౌదరి సుప్రభాత్ రావు
రామాయంపేట. 08.( ప్రజా సర్వం)
మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జన్మదిన పురస్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే రోహిత్ రావ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం, మాజీ సర్పంచ్లు మహేందర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్. రామాయంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి అల్లడి వెంకటి. మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు దారం సంతోష్, మాజీ కౌన్సిలర్ చిలుక గంగాధర్, నాయకులు వినయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు


