గుమ్మడిదల మున్సిపల్ ఎదుట ధర్నా

గుమ్మడిదల మున్సిపల్ ఎదుట ధర్నా

 గుమ్మడిదల నవంబర్ 20(ప్రజాస్వరం) గుమ్మడిదల మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నాడు గుమ్మడిదల గురువారం నాడుమున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కమిషనర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వచ్చే పదహారువేల600 వేతనము సరిపోవడం లేదని అన్నారు. మున్సిపల్ ఏర్పడి 11 నెలలు పూర్తవుతున్న నేటి వరకు యూనిఫామ్ లు చెల్లించలేదని అన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించిన ఏ ఒక్క కార్మికునికి ఉపయోగపడడం లేదని అన్నారు. విధి నిర్వహణలో కార్మికునికి కాలు విరిగితే ఏ ఒక్క అధికారి నేటి వరకు పట్టించుకోలేదని అన్నారు. అందుకోసం మున్సిపల్ అధికారులు ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. గ్రామపంచాయతీ ఉన్న కాలం నుండి మున్సిపల్ వరకు విధులు నిర్వహిస్తున్నారని, అందుకోసం అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సబ్బులు, నూనెలు బెల్లం, ప్రతి సంవత్సరం ఇచ్చే రైన్ కోట్సమయానికి ఇవ్వాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడంతో, అనేక సమస్యలు పెండింగ్లోనే ఉంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రవీందర్, గుమ్మడిదల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి, కోశాధికారి వీరేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్, ప్రధాన కార్యదర్శి మహేష్, సలహాదారులు రమేష్, లింగమ్మ, కిషన్ అమ్మ, కవిత, చంద్రయ్య లు పాల్గొన్నారు.