ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదవాలి

ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదవాలి

 

మిరు దొడ్డి నవంబర్ 14 (ప్రజాస్వరం)

Read More సిద్దిపేట డీసీసీ గా తుంకుంట ఆంక్షరెడ్డి నియామకం..

ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మిరుదొడ్డి మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన సొంత డబ్బులతో బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందని పోలీస్ రాజులు,  మాజీ ఉప సర్పంచ్ దిలీప్ రెడ్డి  అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.

Read More ఫోటో ,వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక