అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు...

అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు...

మెదక్ నవంబర్ 22 (ప్రజా స్వరం)

అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు, డీఎస్పీ ప్రసన్న కుమార్ తో పాటు రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇకపై జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ నేతలు అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహించారని, హరీష్ రావు కూడా మెదక్ నుండి పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు. మెదక్‌లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు ప్రోత్సహించబడవని రోహిత్ స్పష్టం చేశారు.

Read More బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం...