చేగుంట వడియారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి...

ఎంపీ రఘునందన్ రావు....

చేగుంట వడియారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి...

మెదక్ నవంబర్ 22 (ప్రజా స్వరం)

చేగుంట వడియారం రైల్వే మార్గాన్ని జీరో యాక్సిడెంట్ జోన్ గా తయారు చేయాలని 

Read More అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు...

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, ఆర్&బి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చేగుంట వడియారం రైల్వే గేటు వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రైల్వే పెండింగ్ లో ఉండడం వల్ల ప్రతి సారి వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడంతో అంబులెన్స్‌లు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నాయన్నారు. రద్దీ సమయంలో పాదచారులు ట్రెక్కులు దాటే పరిస్థితి ఏర్పడి పెద్దా ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. రోడ్డు-రైలు కలిసే స్థాయిలను తగ్గించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, అండర్ బ్రిడ్జ్‌లు నిర్మించడం ప్రమాదాల నివారణకు ప్రధాన చర్యలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. తక్షణం కాంట్రాక్టర్, సంబంధిత శాఖల ఇంజనీర్లు సమన్వయంతో రోబి పనులు పూర్తిచేసి, సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, సిగ్నలింగ్ వంటి అనుబంధ సదుపాయాలను కూడా సమగ్రంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ, ఆర్ అండ్ బీ శాఖ, ఇతర శాఖల అధికారులందరూ సమన్వయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని, రాబోయే రోజుల్లో ఈ మార్గంలో “జీరో యాక్సిడెంట్ జోన్” లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

Read More గుమ్మడిదల మున్సిపల్ ఎదుట ధర్నా

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజల రవాణా సౌకర్యార్థం అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు. 

Read More లక్షలాది మందికి ఆశా కిరణాలుగా సత్య సాయి సేవలు.... 

ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, శాఖల అధికారులందరూ పాల్గొన్నారు.

Read More ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీవో లు, పార్ట్‌ టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త ..