ఘనంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ జయంతి వేడుకలు..

.

చిన్న శంకరంపేట 
నవంబర్ 14
(ప్రజాస్వరం )

Read More ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీవో లు, పార్ట్‌ టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త ..

చిన్న శంకరంపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పండిత్  జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి రాజిరెడ్డి తో పాటు పలువురు నాయకులు సాయి విద్యాలయం ఉపాధ్యాయ బృందం  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,  సాయి విద్యాలయం విద్యార్థులు గ్రామంలో పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు, విద్యార్థుల తో ర్యాలీలో పాల్గొన్న రాజిరెడ్డి విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు, అనంతరం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికను సృష్టించి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లిన మహా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రు అని ఆయన కొనియాడారు, దేశాన్ని బ్రిటిష్ లు పూర్తిగా దోచుకుపోయారని జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయ్యాక భారతదేశ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మాణం చేయాలి పాడిపంటలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి, విదేశీ సంబంధలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని ఆలోచనతో ఆయన దేశ అభివృద్ధికి బాటలు వేశారని వారన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, సాయి విద్యాలయం కరస్పాండెంట్  మల్లికార్జున్, ఎరుగంటి కిష్టయ్య,జీవన్, ఏదుల్మియా, వెంకటేష్, ఎర్రి కుమార్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More సిద్దిపేట డీసీసీ గా తుంకుంట ఆంక్షరెడ్డి నియామకం..