పాఠశాలల అభివృద్ధి పనులు పక్కా ప్రణాళిక ద్వారా పటిష్ట చర్యలు.....కలెక్టర్ రాహుల్ రాజ్

పాఠశాలల అభివృద్ధి పనులు పక్కా ప్రణాళిక ద్వారా పటిష్ట చర్యలు.....కలెక్టర్ రాహుల్ రాజ్


మెదక్ సెప్టెంబర్ 25 (ప్రజా స్వరం)

Read More వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

టేక్మాల్ పీహెచ్సీ మోడల్ స్కూల్, కే.జీ.బీవీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాలు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.  గురువారం టేక్మాల్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోడల్ స్కూల్ కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి.హెచ్.సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసo స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీ.హెచ్.సీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని పరిశీలించారు. ఈ శిబిరంలో పిల్లల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ శిబిరాలను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి, ప్రత్యేక వైద్యులు పాల్గొనే ఈ శిబిరాలకు తరలించాలని అన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించి పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికల తయారుచేసిన సందర్భంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు గుణాత్మక విద్య అందించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి