హరీష్ రావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు...

హరీష్ రావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు...

ప్రజాస్వరం : మనోహరాబాద్ : 04 :

 

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే కన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు టిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు చేసిన కృషిని అభినందించారు. కాల కంటి బంగారమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు అనంతరం జరిగిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పురం మహేష్ వెల్లడించారు.