సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి....
మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి....
By Prajaswaram
On
ప్రజాస్వరం , మేడ్చల్:
సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లిలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలను నింపి, అందజేయాలన్నారు.సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు.ఓటు హక్కును కోల్పోతే భవిష్యత్లో జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా బీఆర్ఎస్ నాయకులు ఓటర్ జాబితాను పరిశీలిస్తూ సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించారా లేదా వాకబు చేయాలన్నారు. బీహార్, పశ్చిమబెంగాల్లో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయాయన్నారు. ఏ ఒక్క ఓటు కూడా సర్ లో పోకుండా చూడాలని వీఎజీవోలకు సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు నర్సింహ గౌడ్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, సదానంద్,సింహాల్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
30 Jun 2026 21:49:40
ప్రజాస్వరం, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...


