ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలి...

ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలి...

ప్రజాస్వరం : బోయిన్పల్లి  : జూన్  28. :

హైదరాబాద్ బోయిన్పల్లిలో నిర్వహించిన "పల్స్ పోలియో" కార్యక్రమం మొదటి రోజు అత్యంత విజయవంతంగా ముగిసింది.మొదటి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన మిగిలిన పిల్లల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) రెండు రోజుల పాటు వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు,మరియు అంగన్వాడీ టీచర్లు కలిసి ఇంటింటికీ తిరుగుతారన్నారు. మొదటి రోజు రాలేకపోయిన ప్రతి ఒక్క చిన్నారిని గుర్తించి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులందరూ అలసత్వం వహించకుండా, తమ ఇంట్లో ఐదేళ్ల లోపు పిల్లలు ఉంటే రేపు, ఎల్లుండి వచ్చే సిబ్బంది ద్వారా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పిల్లలను అంగవైకల్యం నుండి విముక్తులను చేయాలన్నారు. జరిగిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు, వాలంటీర్లకు మరియు సహకరించిన తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.