24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో బీజేపీ జిల్లా కార్యాలయం...
ఎంపీ రఘునందన్ రావు.....
తెలంగాణ లో బీజేపీ అధికారమే లక్ష్యం.....
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28 :
దేశంలో ఏ రాజకీయ పార్టీ కి లేనటువంటి పార్టీ కార్యాలయం బీజేపీ పార్టీ కి ఉందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం నూతన మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ పద్ధతి లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎంపీ రఘునందన్ రావు శిల పలకాన్ని ప్రారంభించిన అనంతరం మెదక్ జిల్లా జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బీజేపీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యాలయం బీజేపీకి ఉందన్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుండి అమలు అవుతాయని, నేను ఎమ్మెల్యే గా, ఎంపీ గా పోటీ చేసినప్పుడు అద్దె భవనాల్లో చాలా ఇబ్బందిగా ఉండేదని తెలిపారు. ఇప్పుడు నా పార్లమెంట్ పరిధిలో మెదక్, సిద్ధిపేట లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకోవడం సంతోషం గా ఉందని అన్నారు. ఈ కార్యాలయం పునాది నుండి శంకుస్థాపన వరకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాలకు అధ్యక్షునిగా ఉన్న సునీల్ భన్సల్ ఏడు రాష్ట్రాలను అధికారంలోకి తెచ్చాడని, పశ్చిమ బెంగాల్ గెలుపు తరువాత మిగిలిన తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అయన కృషి చేస్తారని పేర్కొన్నారు. మనం ప్రారంభించుకున్న ఈ కార్యాలయం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పంచాయతీ, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ నుంచి ఉండాలని కోరారు. నా గెలుపు కోసం ఏ విధంగా బీజేపీకి పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారో అదే విధంగా మీ వెంటే నేను ఉంటానాని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెసు, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఖతమయ్యాయని పేర్కొన్నారు. రెండు పార్టీలు అవినీతిని బహిర్గతం చేస్తూ తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి లు సురేష్, శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు మల్లికా, నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్, పంజా విజయ్, కవిత రెడ్డి, నందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


