జలమయంలో తూప్రాన్ ప్రధాన రహదారి ….
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 28 :
కురుస్తున్న వర్షాలకు తూప్రాన్ ప్రధాన రహదారి పై నీరు ప్రవహిస్తుంది.తూప్రాన్ పట్టణంలోని శబరి మార్కెట్ ముందు పూర్తిగా నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తేలికపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే కాలంలో బారి వర్షాలకు పట్టణ పరిస్థితి ఎలా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.
Latest News
28 Jun 2026 22:13:08
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 28 : పేకాట ఆదుతున్నారని నమ్మదగిన సమాచారంతో పేకాట స్థావరం పై పోలీస్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.శివంపేట...


