పేకాట స్థావరం పై పోలీసుల దాడి...

పేకాట స్థావరం పై పోలీసుల దాడి...

ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 28 :

పేకాట ఆదుతున్నారని నమ్మదగిన సమాచారంతో పేకాట స్థావరం పై పోలీస్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.శివంపేట మండలంలోని కోతాపేట గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు శివంపేట పోలీసులు ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.22,930 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మండల పరిధిలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శివంపేట ఎస్‌ఐ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.