మల్కాపూర్ లో ఫ్రీ ప్రైమరి స్కూల్ లో అక్షరాబ్యాసం... 

మల్కాపూర్ లో ఫ్రీ ప్రైమరి స్కూల్ లో అక్షరాబ్యాసం... 

ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 22 : 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు వినూత్న రీతిలో రాష్ట్ర సర్కార్ విద్య బోధనకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం అని సర్పంచ్ కొనియాడారు. మల్కాపూర్ కు మంజూరైన ఫ్రీప్రైమరీ స్కూలు సౌకర్యాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి సత్యనారాయణ సూచించారు. పాఠశాల తరగతి గది పెయింటింగ్, చిత్రలేఖనం, ఆట వస్తువుల కై ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మంజూరు చేసిందని త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంఈఓ తెలిపారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్రావు, యాదగిరి, ఉప సర్పంచ్ స్వామి, ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీలత, వార్డు సభ్యులు రేఖ, మేక్ ఇన్ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.